ఒక అడవిలో కుందేలు, ఎలుక ఎంతో స్నేహంగా వుండేవి. కుందేలు కాస్త అహంకారి. ఎలుక కొంటె కోనంగి కుందేలు ఎలుక కనిపించినప్పుడల్లా నాతో సమానంగా పరిగెత్తలేవు ” అని ఎగతాళి చేస్తూ ఉండేది

ఒకరోజు కుందేలు ఎలుకను ఎగతాళి చెయ్యడం మరొక ఎలుక విన్నది. ఈ రెండు ఎలుకలు ఇంచుమించు ఒకే పోలికలో వున్నాయి. కుందేలుకు గుణ పాఠం చెప్పాలనుకుంది రెండో ఎలుక. ఈ రెండు ఎలుకలు కలిసి ఒక ఉపాయం ఆలోచించాయి.

మర్నాడు కుందేలు యధా ప్రకారం ఎలుకను ఏడిపించ సాగింది . ” ఏమిటి ? .. నువ్వు వేగంగా పరిగెత్తగలనంటావు ? నువ్వు అయితే పందె … కాస్తావా ? ” అని అన్నది. ఎలుక ” పిచ్చిపుల్లయ అహంకారి కుందేలు గెలుస్తాననుకుంటున్నావా? ” ఎగతాళిగా అంది కుందేలు. “సరే ! అయితే రేపు ఉదయం ఇక్కడి నుండే పందెం మొదలు పెడదాం ” అని ఎలుక వెళ్ళిపోయింది. నాతోనే పందెం కాసింది దీనికెంత పొగరు అని కుందేలు కూడా వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయం అనుకున్నట్లే పందెం మొదలైంది. తాను గెలుస్తానన్న గర్వంతో కుందేలు ఎలుకను ముందుగా పోనిచ్చింది. ఎలుక కనుమరుగు కాగానే కుందేలు పరి గెత్తడం మొదలు పెట్టింది. దారిలో ఎక్కడా కుందేలుకు ఎలుక కనపడలేదు. ఆశ్చర్యం ఎలుక ముందే గమ్యం చేరి కుందేలుకు స్వాగతం పలికి ” మళ్ళీ పందెం పెట్టుకుందామా ? ” అన్నది ఎలుక. కుందేలు ” సరే ” నని ధీమాగా ఎలుకను ముందు వెళ్ళనిచ్చింది. కొంతసేపటి తరువాత కుందేలు పరుగెత్తింది. కాని దారిలో ఎక్కడా కుందేలుకు ఎలుక కనపడ లేదు. విచిత్రం రెండోసారి కూడా ముందు ఎలుకే గమ్యాన్ని చేరుకుంది. కుందేలు రొప్పుకుంటూ చేరి ఆశ్చర్యపోయింది.

“ మిత్రమా ! అలసిపోయావా ! మళ్ళీ పోటికీ వస్తావా ? ” అని ఎలుక అడిగింది. ‘ వీడు మాయగాడిలా ఉన్నాడు ‘ అని మనసులో అనుకొని రోషంతో అంగీకరించింది కుందేలు. ఎన్ని సార్లు పోటీ పడినా కుందేలుకు ఓటమి తప్పలేదు. పదిసార్లు పోటీపడింది. ప్రతిసారీ ఎలుకే గెలిచింది. కుందేలు అలసిపోయి సిగ్గుతో పందెంలో ఓడిపోయినట్టు ఒప్పుకుంది. ఆరోజు సాయంత్రం రెండు ఎలుకలు జొన్నకంకులు తింటూ కుందేలుకు కనిపించినవి రెండూ ఒకే పోలికలో పరస్పర విశ్వాసమే మనిషి జీవితానికి బాసటగా వున్నాయి. అందులో ఒక ఎలుక “ గర్వం పతనానికి మూలం ” అన్నది. రెండవ ఎలుక “ అవును కుందేలుకు చెవులు చిన్నవీ, కళ్ళు పెద్దవిగా ఉంటే బాగుండేది. పందెం నేను మొదలు పెడితే నువ్వు ముగించావనీ నువ్వు మొదలుపెడితే నేను ముగించా నని తెలుసుకోగలిగేది ” అని ఆ రెండు ఎలుకలు అనుకుంటూ కుందేలును వెక్కిరించినవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *