అందాల భామ అనసూయ గురించి తెలియని ప్రేక్షకులు ఉంటారా.? స్టార్ హీరోయిన్స్ కు కూడా సాధ్యం కానీ క్రేజ్‌ను బుల్లితెర నుంచే అందుకుంది ఈ బ్యూటీ. జబర్దస్త్ షోతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది అనసూయ. ఈ కామెడీ షోలో తన మాటలతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది అనసూయ. న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ అంచెలంచలుగా ఎదిగి ఇప్పుడు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తుంది అనసూయ.

రంగమ్మత్త పాత్ర ఈ అమ్మడు క్రేజ్ ను డబుల్ చేసింది. ఇక అనసూయ సోషల్ మీడియాలో చాలా బిజీగా ఉంటుందన్న విషయం తెలిసిందే.. రెగ్యులర్ గా తన క్రేజీ ఫోటోలను షేర్ చేస్తూనే.. సమాజంలో జరిగే సంఘటనల పై కామెంట్స్ చేస్తుంది. అలాగే తన పై వచ్చే ట్రోల్స్ పై కూడా గట్టిగా కౌంటర్లు ఇస్తూ ఉంటుంది.

అనసూయ పై గతంలో చాలా ట్రోల్స్ వచ్చాయి. జబర్దస్త్ లో చిన్న చిన్న డ్రస్సులు వేస్తుందని, అడల్ట్ జోక్స్ ను ఎంకరేజ్ చేస్తుందని ఆమెను ట్రోల్ చేశారు నెటిజన్స్. షోలో బాడీ షేమింగ్ చేస్తూ మహిళలను కించపరుస్తున్నారని ఆ షోకు హోస్ట్ గా చేస్తున్న అనసూయను కూడా గట్టిగా ట్రోల్ చేశారు నెటిజన్స్.

అయితే ఆ కామెంట్స్ పై చాలా సార్లు అనసూయ స్పందించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో అనసూయ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి. బూతులు మాట్లాడుతున్నారు.. డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్తున్నారు అంటూ తమను ట్రోల్ చేస్తున్నారు.

కానీ 90’s లో వచ్చిన సాంగ్స్ ఎప్పుడైనా విన్నారా..? ఆ సాహిత్యంలో ఎంతో డబుల్ మీనింగ్ ఉంటుంది. అప్పుడు ఆ పాటలను అందరూ ఎంజాయ్ చేశారు. అప్పుడు మీడియా, సోషల్ మీడియా ఇలా లేవు కాబట్టి అవి బయటకు రాలేదు. అడల్ట్ జోక్స్ ఎంకరేజ్ చేసేందుకు నాకు బాధగా అనిపిస్తుంది. కానీ తప్పడంలేదు.. నా కెరీర్ కోసం చేయాల్సి వస్తుంది. ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాలి కదా.. అని అనసూయ కామెంట్ చేశారు.

ఆ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ సాంగ్స్ వింటుంటే అనసూయ చెప్పింది నిజమే.. ఇంత డబుల్ మీనింగ్స్ ఉన్నాయా అని అనిపిస్తుంది అంటున్నారు నెటిజన్స్. కొంతమంది ఆ డబుల్ మీనింగ్ లిరిక్స్ ను ఇన్ స్టా రీల్స్ లోనూ షేర్ చేస్తున్నారు. ఇక అనసూయ జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది అనసూయ.

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *