గృహజ్యోతి పథకం కోసం మళ్లీ దరఖాస్తులు స్వీకరించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

అర్హత ఉన్నప్పటికీ గతంలో దరఖాస్తులు చేయనివారి నుంచి అప్లికేషన్లు తీసుకోవాలని నిర్దేశించారు. ప్రజాభవన్ లో ఇంధనశాఖతో పాటు డిస్కమ్ ల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఇప్పటిదాకా దరఖాస్తు చేసుకోని వారి నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరించి, పథకాన్ని అమలు చేయాలని భట్టి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *