ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అరుదైన ఘనతను సాధించారు. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ప్రపంచవ్యాప్త టాప్ సెంట్రల్ బ్యాంకర్ అవార్డును దాస్ వరుసగా రెండో ఏడాది పొందినట్టు ప్రకటించింది.
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం, ఆర్థికవృద్ధి లక్ష్యాలు, కరెన్సీ స్థిరత్వం, వడ్డీరేట్ల నిర్వహణలో విజయం సాధించడం వంటి అంశాల్లో దాస్ ఉత్తమ ర్యాంకును పొందారని గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ వెల్లడించింది.