ఒడిశాలోని గంజాం జిల్లాలో కల్తీ మద్యం తాగి సోమవారం అర్థరాత్రి 17 మంది ఆస్పత్రిలో చేరారు.
గంజాం జిల్లాలోని కర్బలువా గ్రామానికి చెందిన సుమారు 20 మంది మౌండ్పూర్ గ్రామం వద్ద నాటు మద్యం సేవించారని, వారిలో 17 మంది అస్వస్థత గురై వాంతులు అవడంతో ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఐదుగురి పరిస్థితి క్షీణించడంతో బెర్హంపూర్ ఆసుపత్రికి చేర్పించినట్లు వివరించారు.