ఆడవాళ్లు గాజులు ధరించే విధానంలో కొన్ని నియమాలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

స్త్రీలు ఎల్లప్పుడూ పసుపు రంగు లేదా ఎరుపు ఆకుపచ్చ రంగులు మట్టి గాజులు ధరించాలి. బంగారు గాజులు ధరించినప్పటికీ రెండు బంగారు గాజుల మధ్య కనీసం 6 గాజులకు తక్కువ కాకుండా మట్టి గాజులు ఉండేలా చూసుకోవాలి. కేవలం బంగారు గాజులు మాత్రమే ధరించి మట్టి గాజులు ధరించకపోతే ధనపరమైన సమస్యలు ఎదురవుతాయి మరియు ఖర్చులు కూడా పెరుగుతాయి.

నలుపు రంగు నీల రంగు గాజులు శని భగవానునికి ప్రతీక కావున ఈ రంగు గాజులు ధరించరాదు. నలుపు లేదా నీలో రంగు గాజులు ధరిస్తే పనులు ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కొత్త గాజులు ధరించాలి అనుకుంటే గురువారం నాడు మంచిది. పాత గాజులు మార్చుకోవాలి అనుకున్నప్పుడు సోమవారం లేదా బుధవారం నాడు మార్చుకోవాలి.

పసుపు రంగు గాజులు గురు భగవానుడు మరియు చంద్రునికి సంకేతం పసుపు రంగు గాజులు ధరిస్తే ఏ సమయంలో ఏ నిర్ణయాలు తీసుకుంటే అనుకూలుస్తుంది అనే విషయంలో గ్రహాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. పసుపు రంగు గాజులు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కంపెనీలో ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉన్నవాళ్లు ధరించడం మంచిది. ఆకుపచ్చ రంగు గాజులు బుధుడికి సంకేతం వ్యాపార రంగంలో ఉన్నవారు ధనపరమైన లావాదేవీలు జరిపేవారు ఆకుపచ్చ రంగు గాజులు ధరించడం మంచిది.

చదువుకునే అమ్మాయిలు, ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు పోటీ పరీక్షలు రాస్తే వారు ఎరుపు రంగు గాజులు ధరిస్తే మంచి ఫలితాలు ఇస్తాయి. సంతానం కావాలి అనుకున్న వారు బంగారు గాజులు ధరించాలి.

ఆడవాళ్లు పుట్టింటి నుండి వచ్చే సమయంలో గాజులు కొని తెచ్చుకుంటే వారికి ఆయుష్ పెరుగుతుంది. పగిలిన గాజులు ధరిస్తే అప్పులు పెరుగుతాయి. ఒకసారి ధరించిన గాజులు వేరే వాళ్ళకి ఇస్తే మానసిక సమస్యలు ఎదురవుతాయి. గుమ్మం బయట కూర్చుని కానీ లోపల కూర్చుని కానీ అనగా గడప దగ్గరలో కూర్చుని గాజులు ధరించరాదు.

జుట్టు విరబోసుకుని గాజులు ధరించరాదు. గాజులు ధరించాల్సి వచ్చినప్పుడు మంగళవారం ధరించరాదు. పూర్తిగా గాజులు తీసి కొత్తవి వేసుకోవాలనుకున్నప్పుడు చేతికి పసుపు రంగు గాని ఎరుపు రంగు గాని దారం కట్టుకుని తర్వాత గాజులు తీయాలి. గాజులు ధరించిన తర్వాత ఆ రంగు దారం తీసివేయవచ్చు.

గాజులు ధరించే సమయంలో ఈ నియమాలు పాటిస్తూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి.