ప్రస్తుతం టాలీవుడ్లో రీ-రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. హీరోల జన్మదినం సందర్భంగా వారు నటించిన మూవీలను మరోసారి విడుదల చేస్తున్నారు.
అక్టోబర్ 23న ప్రభాస్ జన్మదినం సందర్భంగా ఆయన నటించిన తొలి మూవీ ఈశ్వర్ తో పాటు డార్లింగ్ కూడా రీ-రిలీజ్ కానున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. జూనియర్ శ్రీదేవి హీరోయిన్గా నటించిన ఈశ్వర్ చిత్రానికి జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించారు.