రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ ఇచ్చిన హామీపై NCP(SP) అధ్యక్షుడు శరద్ పవార్ ధ్వజమెత్తారు. వాస్తవానికి రైతుల ఆత్మహత్యలు రెట్టింపయ్యాయని విమర్శించారు.
మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో జరిగిన ఓ ర్యాలీలో శరద్ పవార్ మాట్లాడారు. బీజేపీ హయాంలో పండించిన పంటకు కనీస మద్దతు ధర లభించడం లేదని, రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని అన్నారు.