తెలంగాణ ప్రభుత్వానికి పన్నుల రాబడి పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25) మొదటి త్రైమాసికం ఏప్రిల్-జూన్ వరకూ పన్నుల రూపంలో రూ.34,609.50 కోట్ల ఆదాయం సమకూరింది.

గతేడాది (2023-24) ఇదే త్రైమాసికంతో పోలిస్తే అదనంగా రూ.2,884.50 కోట్ల ఆదాయం పెరిగింది. వాస్తవానికి గతేడాది ఇదే త్రైమాసికంలో కేంద్రం గ్రాంట్ల రూపంలో రూ.1,811 కోట్లు ఇచ్చినా ఈ ఏడాది ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదని కాగ్ నివేదిక వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *