అమెరికాలో భారీ ప్యాకేజీతో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించింది ఓ తెలుగమ్మాయి. కడప జిల్లా రైల్వేకోడూరు పట్టణానికి మాచినేని విశ్వేశ్వరనాయుడు, షర్మిల దంపతుల కుమార్తె నిఖిత అమెరికాలోని కార్నెంజ్ మెలాస్ విశ్వవిద్యాలయంలో సీఎస్సీలో మాస్టర్ డిగ్రీ సాధించారు.
న్యూజెర్సీలోని న్యూబిస్ కమ్యూనికేషన్స్ సంస్థ క్యాంపస్ ఇంటర్వ్యూలు జరపగా రూ.1.42 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సాధించింది. నిఖిత కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.