నామస్మరణం యజ్ఞ యాగాదులు చేయలేని వారు కేవలం భగవంతుడి నామాన్ని జపిస్తే చాలు. ఈశ్వరుడు నామాలు అనంతాలు ఆయన అనంతడు. సహస్రనామాలు అనడం మన సాలభనం కోసం దైవగుణాలను వర్ణించేవి ఆ నామాలు. స్వామిలీలలను తెలియజేసే అర్థాలు గల పదాలు అవన్నీ, సకల లోకాల్లో నివసిస్త్తాడు కాబట్టే వాసుదేవ్ఞడు విశ్వమంతా వ్యాపించి వ్ఞంటాడు. కాబట్టే విష్ణువ్ఞడు, నరసింహుడు అనగానే ప్రహ్లాదుడి భక్తితత్వరత గుర్తుకు వస్తుంది. ఒక్కొక్క నామంతో అనేక పురాణ పవిత్రగాధలు ముడిపడి ఉన్నాయి.
వాటిని తలచుకోగానే మనసు భక్తి ప్రపూర్ణం అవ్ఞతుంది. మన విశ్వాసాలు అనుసరించి ఇష్టమైన ఏ భగవన్నామ్మాన్నైనా జపించవచ్చు. ఆకాశం నుంచి భూమిపై పడే నీరు వివిధ నామాలు గల నదీనదాల ద్వారా సముద్రాన్ని చేరుతుంది. భక్తితో భగవంతుడి ఏనామాన్ని స్మరించినా అది భగవంతుడికే చెందుతుంది. వివిధ నామాలతో తనను పిలుస్తున్నా అందరినీ స్వామి సామరస దృష్టితోనే చూస్తాడు. ఆయన కరుణ తండ్రి వంటిది. తండ్రీ బిడ్డలందరినీ సమంగా భావిస్తాడు. ఒక్క పిలుపుతో పలికే స్వామి అదేపనిగా పదేపదే తన నామస్మరణ గావించేవారిని ఉపేక్షిస్తాడా? ఆవ్ఞలించినా తుమ్మినా దైవనామస్మరణ చేయడం ఒక సంప్రదాయం భోజనానికి ముందూ వెనకా గోవిందనామస్మరణ చేస్తారు. వేదాంత సారాన్ని పిండి భజగోవిందం అన్నారు. ఆదిశంకరుడు సంతానానికి దైవనామాలు పెట్టడం ఒక ప్రాచీన ఆచారం.
వారిని పిలిచినప్పుడల్లా భగవన్నామస్మరణ జరుగుతూనే ఉంటుంది. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. కృష్ణుడు చక్రహస్తుడై ఉత్తర గర్భా´న్ని రక్షించాడు. అప్పుడు కుంతి శ్రీకృష్ణా యదుభూషణా సరసభా శృంగారరత్నాకరా అంటూ పలు నామాలతో స్వామిని స్తుతించింది. ఇందులో ప్రతి పదమూ ఒక్కొక్క లీలను గుర్తుచేస్తుంది. కృష్ణుడు బాగున్నాడా ?అని చిన్న ప్రశ్న వేయడానికి భక్తవత్సలుడు బ్రహ్మణ్యుండు గోవిందుడు ఈశుడు సుఖంగా ఉన్నాడా? అని ధర్మరాజు అర్జునుని అడుగుతాడు. ఇలాంటవన్నీ ఆ స్వామి నామసంకీర్తనలే జయవిజయాలు సనక సనందులను వైకుంఠద్వారంలో అడ్డగించారు. ఫలితంగా మునివరుల శాపానికి గురి అయ్యారు. పశ్చాత్తాపం చెందారు. మరుసటి జన్మలో కూడా హరి నామాన్ని మరువని వరం ఇవ్వండి అని కాళ్లావేళ్లా పడ్డారు. శాపఫలితంగా జయవిజయాలు మొదట హిరాణ్యాక్ష హిరణ్యకశివ్ఞలుగా రెండో జన్మలో రావణకుంభకర్ణులుగా మూడో జన్మలో శిశుపాల దంత వక్రులుగా జన్మించారు. శ్రీహరిపై వైరం వహించి ఆయన నామాన్నే సదా స్మరించ సాగారు. దైవనామాలే పవిత్రమంత్రాలు. నారధుడు ధ్రువ్ఞడికి ఓం నమో భµగవతే వాసుదేవాయ అనేద్వాదక్షర మంత్రం ఉపదేశించారు.
మహర్గులు వాల్మీకి రామ అనే తారక మంత్రాన్ని ఉపదేశించారు. నమశ్శివాయ పంచాక్షరీ తారకనామాన్ని జపిస్తూ పోతన రామదాసు త్యాగయ్య,హేమదాసు వంటి మహాత్ములు ముక్తిని పొందారు. హేరామ్ అంటూ మహాత్ముడు ఇహలోకం విడిచాడు. భక్తికి, ముక్తికి సులభ సాధనమైన నామస్మరణం కలియుగంలో సర్వసమాధరణీయం.