సూడాన్ లో కలరా ప్రబలి వందలాది మంది ఆసుపత్రి పాలయ్యారని అక్కడి ఆరోగ్య శాఖ మంత్రి హైతం మొహమ్మద్ ఇబ్రహీం వెల్లడించారు. దాదాపు 22మంది మృతి చెందారని తెలిపారు. ఇటీవల వరదలతో సతమతమై ఉన్న ఈ ఆఫ్రికన్ దేశంలో 354 కలరా కేసులు నమోదయ్యాయి.
ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) గణాంకాల ప్రకారం ఈ ఏడాది జులై 28 నాటికే సూడాన్ లో 78కలరా మరణాలు నమోదై ఉన్నాయి.