శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం సృష్టిస్తోంది. నిన్నరాత్రి నీలం సంజీవరెడ్డి భవన్ దిగువన గేటు ముందు చిరుతపులి నిలుచొని చూస్తున్న దృశ్యాలను కొందరు భక్తులు గమనించారు.
భక్తులు కారులో నుండి చూసి భయాందోళనకు గురయ్యారు. కారులోనే కూర్చొని చిరుతపులి గేటు ముందు ఉన్న దృశ్యాలను వారి సెల్ఫోన్ లో చిత్రీకరించారు. అయితే, జనసంచారం చేసే ప్రాంతంలోకి చిరుతపులి రావడంతో ఒక్కసారిగా భక్తులు ఉలిక్కిపడ్డారు.