సత్యనారాయణ స్వామి ఆవిర్భావం…

భూలోక సంద్యర్థం భువిని స్వర్గంలో మంచి మంచి వరప్రసాద ఫలంగా స్వాత శ్రీ మహావిష్ణువు గర్వంగా పై అంకుడు చెట్టు మొదల్లోని పట్టలో స్వయంపై అవతరించాడు. ఈ శుభ ఆవిర్భావానికి దేవతలంగా సంతసించి, పులగించి పుష్పవృష్టి కురిపించారు. కిర్లంపూడి సంస్థానాధీశులు, శ్రీ రాజ యినుగంటి వెంకట రామరాయడం బహద్కర్ వారి ఏలుబడిలో అన్నవరం గ్రామం ఉండేది. ఈ గ్రామానికి చెందిన బ్రాహ్మణోత్తములు, నిత్యాన్నదాతలు అయిన శ్రీ యీరంకి సూర్యప్రకాశం గారి స్వప్నంలో స్వామి సాక్షత్కరించి “ఓయీ బ్రాహ్మణోత్తమా! నేను సత్యనారాయణ అను నామమున రత్నగిరి పై అంకుడు చెట్టు గ్రింద పుట్టలో ఉన్నాను. భక్త రక్షణార్ధము అర్చామూర్తిగా అవతరించిన నన్ను వెలికితీయించి అర్చనాదికములు గావించుము అని పలికాడట. శ్రీ సూర్య ప్రకాశలింగం గారు స్వప్నం నుంచి మేలుకుని తనకు ఆ కల తెల్లవారు ఝామున వచ్చినది. కావున ఇది తప్పక సత్యము అని భావించి ఈ వార్త రాజావారికి విన్నవించాడట. చిత్రంగా రాజావారికి సైతం ఇదే కల ఇలాగే… సూర్యప్రకాశం గారికి వచ్చిన సమయంలోనే వచ్చిందట! ఇది ముమ్మాటికి సత్యమేనని నిశ్చయించి శ్రీ రాజావారు సపరివార సమేతంగా అన్నవరం చేరి అంకుడు చెట్టు క్రింద పుట్టలో దివ్య తేజస్సు చూసి ఆశ్చర్యపడి పుట్ట నుండి స్వామి వారి దివ్య మంగళ విగ్రహం బయటకు తీయించెను. శ్రీ రాజావారు, శ్రీ సూర్యప్రకాశం ఆనందంతో, భక్తితో, భగవాన్నామస్మరణ చేసి వేదమంత్ర ఘోషతో మేళతాళాలతో విగ్రహమునకు శుద్ది చేసి, స్వామివారికి తాటాకు పందిరి నిర్మించి పూజాధికాలు నిర్వహించి తరించారు. ఇలా కొన్నాళ్ళు గడిచాక శ్రీరాజావారికి దేవతలు, ఋషులు సాక్షాత్కరించి నీవు వెంటనే ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టమని ఆదేశించగా ఆగమ శాస్త్ర పండితులను, శిల్పులను రప్పించి రథాకృతిలో ఆలయ నిర్మాణం గావించారు.

ఆగ్నేయంలో గణపతి, నైరుతిలో సూర్యభగవానుడు, వాయువ్యమున అంబిక, ఈశాన్యమున ఈశ్వరుడు మధ్యభాగమున యంత్ర వేదిక పై మధ్య లింగాకృతిలో బిందు స్థానంలో పవిత్ర పంచాయతనంగా స్వామిని ప్రతిష్టించిన ఆలయ నిర్మాణం అపూర్వం. రెండతస్తులుగా ఉండే స్వామి వారి ప్రధాన ఆలయం క్రింది భాగంలో యంత్రాలయం, పై భాగంలో స్వామి వారి దివ్యమంగళ రూపం దర్శనమిస్తాయి. రెండింటికీ మధ్య పానిపట్టము వంటి నిర్మాణం. అందు పీఠములు బీజాక్షర సంపుటి యంత్రం ఉంది. ఈ వాస్తు నిర్మాణంలోని క్రింది భాగంలో వృత్తాకారమైన శిలాయంత్రం (బ్రహ్మ స్వరూపమని, నడుమనున్న లింగాకార స్తంభం శివస్వరూపమని, ఊర్ధ్యమండలి విగ్రహం నారాయణ స్వరూపమని పండితులు చెబుతారు. శ్రీ స్వామివారు హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మకు అనంత లక్ష్మీ సతృదేవి సమేతమై శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా భక్త రక్షణ చేయటం అపురూప విశేషం.

శ్రీ మహావిష్ణువు రామావతారంలో రత్నాకరుడు అనే భక్తుని తపస్సుకు మెచ్చి వరం కోరమనగా, “దేవా! నిన్ను నా శిరము పై మోసే భాగ్యాన్ని ప్రసాదించు” అని అడిగాడట కలియుగంలో భక్తు సంరక్షణార్ధం త్రిమూర్తుల ఏకస్వరుపంగా సత్య రజో తమోరూప త్రిగుణాత్మకుడైన వీరవెంకట సత్యనారాయణ అను పేరుతో అర్చామూర్తిగా ఆవిర్భవించిన సుముహుర్తాన నీవు రత్నగిరి రూపంలో నీ శిరస్సున నన్ను వహిస్తావు అని సాక్షాత్ విష్ణుమూర్తి, రత్నాకరునికి వరమిచ్చాడు. ఆ ప్రకారమే రత్నగిరి తన శిరస్సుపై సత్యదేవుని మోస్తున్న పరమపావన దృశ్యం భక్తులకు కనుల వైకుంఠంగా దర్శనమవుతోంది.

కేశవస్వామి ఆలయం…

జగన్మోహిని అవతారాన్ని ధరించిన విష్ణుమూర్తి పేరిట చోళరాజులు నిర్మించిన ఆలయం, మహావిష్ణువు మోహిని అవతారాన్ని ధరించిన ఘట్టాన్ని నల్లని శిల్పాకృతుల్లో నిలిపారిక్కడ. ఇక్కడ విష్ణుపాదం నుంచి గంగ జనించినట్లుగా దాని ఆకాశగంగగా శిల్పీకరించారు. పైగా ఇక్కడ శ్రీ వైష్ణవులకు ఎంతో ఆరాధ్యమైన సాలగ్రామ శిల్పాన్ని ఐదు అడుగుల వెడల్పుతో మూడు అడుగుల ఎత్తులో శిల్పీకరించి నిలిపారిక్కడ.

గోలింగేశ్వరాలయం…

ఇది రామచంద్రపురంలో కలదు . ఇక్కడ గోలింగేశ్వరాలయం, రాజరాజేశ్వరాలయం, చంద్రశేఖరాలయం, తూర్పు అభిముఖంగా నిలిచి ఎందరో భక్తుల్ని ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ శివలింగం చాలా పెద్ద పరిమాణంలో నిలిచి ఉంది. నల్లని రాతితో నిర్మించబడినది. ఈ లింగం మిలమిలా మెరుస్తూ కనిపిస్తుంటుంది.

కపోతేశ్వరాలయం…

ఇది రాజోలులో కలదు. ఇక్కడ శివలింగం పై రెండు కపోతాల ప్రతిమలు ఉండటంతో ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ ఆలయ స్థాన గట్టాన్ని కపోత గుండం అని పిలుస్తారు. ఒక వేటగాడి బారి నుండి తప్పించుకోవడం కోసం ఈ ఆలయానికి వచ్చి శివున్ని వేడుకున్నాయట ఆ కపోత దంపతులు. వీరికి శివ అనుగ్రమం లభించడంతో శరణు లభించిందట. అందుకే ఈ ఆలయం కపోతాల పేరుతో నిలిచిపోయింది.

శ్రీసోమేశ్వరస్వామి వారి దేవస్థానం…, కోటిపల్లి

ద్రాక్షరామానికి దగ్గరగా, పరమ పావనమైన పుణ్యగౌతమీ తీరంలో వెలసి ఉండడమే శ్రీ సోమేశ్వర ఆలయ అపూర్వ విశేషం. సిద్దులను అనుగ్రహించి, కశ్యప మహర్షిచే ప్రతిష్టించబడిన శ్రీసిద్ది జనార్ధన స్వామి ఇంద్రునిచే ప్రతిష్టితమైన శ్రీ కోటీశ్వరస్వామి, చంద్రునిచే ప్రతిష్టితమైన శ్రీ సోమేశ్వర స్వామి కొలువైన కోటిపల్లి క్షేత్రం దర్శించినంత మాత్రం చేతనే కోటి పుణ్యఫలాలు దక్కుతాయి.

క్షేత్ర పురాణం…

శ్రీ సిద్ది జనార్ధనస్వామి

రాక్షసరాజు బలిచక్రవర్తి బారి నుండి రక్షించమని దేవతలు, కశ్యప మహర్షిని వెంటబెట్టుకుని కోటితీర్థ క్షేత్రంలో తపస్సు చేసుకుంటున్న శ్రీమన్నారాయణ మూర్తిని వేడుకున్నారు. వారిని అనుగ్రహించిన శ్రీమన్నారాయణుడు, కశ్యపుడి భార్య అదితి గర్భమున వామనమూర్తిగా అవతరించాడు. బలి నుండి సమస్త రాజ్యమును దానముగా స్వీకరించి దేవలకు ఇచ్చి తాను తపస్సు చేసుకునేందుకు తిరిగి కోటి తీర్థము చేరాడు. ఇంద్రాది దేవతలు శ్రీమన్నారాయణుడిని భక్తితో కొలిచారు. కశ్యప మహర్షి ఈ క్షేత్రంలో శ్రీ సిద్ది జనార్ధన స్వామిని ప్రతిష్టించాడు.

కోటీశ్వర శివలింగం

స్వర్గాధిపతి ఇంద్రుడు, గౌతముడి భార్య అయిన అహ్యలను మోహించి, ఒకరోజు అర్థరాత్రి గౌతముడి ఆశ్రమము ముంగిట కోడివలే కూసి, గౌతముడు నిద్రలేచి గౌతమీ నదికి వెళ్ళగానే ఆశ్రమంలోకి ప్రవేశించి అహల్యతో గడిపాడు. బ్రహ్మముహూర్త సమయం ఇంకా కాలేదని గ్రహించిన గౌతముడు తిరిగి ఆశ్రమానికి వచ్చి జరిగిన వాస్తవం గ్రహించాడు. శరీరమంతా సహస్రయోనులు ఏర్పడగలవని ఇంద్రుడిని, శిలగా మారమని అహల్యను, గౌతముడు శపించాడు. క్షమించమని ఇద్దరూ వేడుకొనగా, శ్రీరాముడి పాదస్పర్శచే యధారూపము పొందగలవని అహల్యకు శాపవిమోచన మార్గం చెప్పాడు. కోటితీర్థంలోని గౌతమీనదిలో స్థానం చేసి, ఆ క్షేత్రంలో వున్న సిద్ధ జనార్ధనుని భక్తితో సేవించి, ఆయన సాన్నిధ్యంలో కోటీశ్వర శివలింగాన్ని కాప్రయుక్తంగా ప్రతిష్టింది అర్పించిన శాపవిముక్తి పొందుతావని ఇంద్రుడితో చెప్పాడు. ఇంద్రుడు అట్లే చేయగా సహనము సహస్ర నేత్రాలుగా మారాయి.

శ్రీఛాయా సోమేశ్వరస్వామి

పూర్వం చంద్రుడు అజ్ఞానంతో తన గురుపత్ని అయిన తారను మోహవేశంతో పొందాడు. సాక్షాత్తు గురుపత్నిని పొందిన పాపం వలన చంద్రుడు తన సహ సిద్ధమైన వెన్నెల ఛాయను కోల్పోయి క్షయ వ్యాధిగ్రస్తుడయ్యాడు. మిక్కిలి పర్చాకామంతో విష్ణుమూర్తికి తపస్సు చేశాడు. “కోటి తీరంలోని గౌతమీ నదిలో స్నానం చేసి క్రీసిట్టి జనార్ధన నామముతో – క్షేత్రంలో వేంచేసియున్న నన్ను దర్శించు. ఈ క్షేత్రాన పార్వతీ సహిత శ్రీ సోమేశ్వర లింగం ప్రతిష్టింది కోటి బిల్వ దళాలతో ప్రార్థించి పాపవిముక్తుడవు కమ్ము ” అని అనుగ్రహించాడు . చంద్రుడు అదేవిధంగా చేసి తాను కోల్పోయిన చంద్రకాంతి ఛాయను పొందాడు. అందుకే ఈ క్షేత్రానికి శాయా సోమేశ్వర లింగ క్షేత్రం అని పేరు వచ్చింది. దీన్నే సోమతీర్థం అని కూడా అంటారు.

కోటి గోవులు, కోటి కన్యాదాతన ఫలాలు, నూరు అశ్వమేధయాగ ఫలాలు, మూడు కోట్ల శివలింగ ప్రతిష్ఠలు ఇచ్చే ఫలం ఈ తీర్థస్నానంతో లభిస్తుంది. కోటిపల్లి తీర్ధంలో బ్రహ్మముహూర్తాన సంకల్ప పూర్వకంగా స్నానమాచరించి, గణపతిని పూజించి , కోటీశ్వరుని, సోమేశ్వము పార్వతిని సిద్ది జనార్ధనలను దర్శించి భక్తులకు మరుజన్మ ఉండదు.

కోటిపల్లి క్షేత్రం…

రాజమండ్రి సమీపంలోని కోటిపల్లిని కోటితీర్థమని కూడా అంటారు. ఈ క్షేత్రంలో శివుడు కోటేశ్వరుడుగా, సోమేశ్వరుడుగా కొలువై ఉన్నాడు. ఇక్కడ కోటి శివలింగాలు ఉండటంతో ఈ క్షేత్రానికి కోటిపల్లి అని పేరు వచ్చిందని అంటారు. ఇది ఆంధ్ర ప్రదేశంలోని పంచారామాల్లో ఒకటైన ద్రాక్షారామం సమీపంలో ఉంది. మహారాష్ట్రలోని త్రయంబకంలో పుట్టి కోస్తా ఆంధ్రకు పావనం చేసే గోదావరి కోటిపల్లి వద్దనే సముద్రంలో కలుస్తుంది. దక్షడి శాపానికి గురై తన ప్రశాన్ని కోల్పోయిన చంద్రుడు కోటితీర్థంలో శివుడిని పూజించి, శాపవిమోచనం పొందాడు. అహల్యను మోహింది గౌతముడి శాపానికి గురైన ఇంద్రుడు కూడా గోదావరిలో స్నానం చేసే శాప విముక్తి పొందాడు. కోటిపల్లిలోనే మునావతారు ఘట్టంతో ముడిపడిన సిద్ధేశ్వర జగన్నాథుడి ఆలయం ఉంది. మహాబలిని అణచవలసిందిగా భక్తులు విష్ణువును ప్రార్థించగా, విష్ణువును వామనరూపుడై ఇక్కడ వెలశాడని చెపుతారు. క్షయ విధ్వంసం కూడా ఇక్కడకు సమీపంలోని ద్రాక్షారామంలోనే జరిగింది. మహాశివరాత్రి నాడు, కార్తీక మాసంలోను గోదావరి స్నానం చేస్తే ఎంతో పుణ్యమని భక్తుల విశ్వాసం.

ద్రాక్షారామం…

ద్రాక్షారామం గోదావరి ఒడ్డున వుంది . దీనిని కాశి అంటారు. ఇక్కడ గల భీమేశ్వరాలయం పంచారామాలలో వొకటి. ఇక్కడ భీమేశ్వరస్వామి లింగాకారంలో వున్నాడు. లింగం సగభాగం నల్లగా, సగభాగం తెల్లగా వుంటుంది . అర్థనారీశ్వరుడు అనటానికి ఇది నిదర్శనం అంటారు. ఇక్కడ లింగం కూడా 60 అడుగుల ఎత్తు ఉంటుంది. పై అంతస్థులోకి వెళ్లి పూజలు జరపాలి.

ఇక్కడగల వినాయకుడి తొండం కుడి చేతిమీదగా వుంటుంది. కాశీలోని విశ్వేశ్వరాలయంలో అన్న పేరు వచ్చిందని ప్రతీతి.

వినాయకుడికి కూడ అలాగే వుంటుంది. దక్షప్రజావతి ఇక్కడ యజ్ఞం చేశాడు కనుక ద్రాక్షారామం తారాకాసురుని కంఠంలో అమృత లింగం వుండేది. అది వుండగా అతన్ని జయించలేరని దానిని ఛిన్నం చేయడానికి దేవతలు కుమారస్వామిని ప్రార్థించారు. కుమారస్వామి దెబ్బకు అది 5 ముక్కలైంది. ఒకటి ద్రాక్షారామంలో, రెండవది అమరారామం (అమరావతి) లో, మూడవది క్షీరారామం (పాలకొల్లు) లో, నాలుగవది సోమారామం (గుణుపూడి , భీమవరం) లో అయిదవది కుమారారామం (సామర్లకోట దగ్గరగల భీమవరం) లో పడ్డాయట.

శాతవాహన రాజైన హాలుని కాలానికే ఈ ఆలయం వున్నట్లు లీలావతీ గ్రంధం అన్న ప్రాకృత బాషా కావ్యంలో పేర్కొన్నారు ఈ ఆలయాన్ని, సామర్లకోటలోని భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని చెబుతారు. అందుకే ఈ రెండు గుళ్లు ఒకే రీతిగా వుండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయికూడ ఒకటే రకంగా వుంటుంది. ఈ క్షేత్రాన్ని గురించిన ప్రశంస శ్రీనాధకవి భీమేశ్వర పురాణంలో వివరించాడు. దుష్యంతుడు, భరతుడు, నలుడు, నహషుడు ఈ స్వామిని అర్చించారని ఆయన వ్రాశాడు.

మాణిక్యాంబిక అన్న బాలిక స్వామికి తనను తాను అర్పించుకొని ఆయనకు దేవేరి అయినట్లు భీమేశ్వర దండకంలో వుంది. ఈమె గుడి కూడ ఇక్కడ వుంది. ఈమె పరాశక్తి అవతారం. భీమేశ్వరాలయానికి వెళ్లే యాత్రికులు మాణిక్యాంబ గుడికి కూడా వెళతారు. స్వామి ఊరేగింపును కూడా మాణిక్యాంబ గుడి చుట్టూ తిప్పి తీసుకువెళ్లటం ఆచారం.

భీమేశ్వరాలయం శిల్ప సంపదకు పేరు పొందింది. మహా శివరాత్రికి ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది. తిట్టు కవిగా ప్రసిద్ధ చెందిన భీమకవి “ఘనుడన్ మేములవాడు వంశజుడు , ద్రాక్షారామ భీమేశునందనుడన్ …..” అని చెప్పుకొన్నాడు. అతనికి కవిత్వం అబ్బటం స్వామి ప్రసాదం అయి వుండవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *