టెస్కో ద్వారా రాష్ట్రంలో శానిటరీ నాప్కిన్ తయారీ యూనిట్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

కోహెడ నుంచి అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్, గిడ్డంగుల సంస్థ గోదాములపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, ఖమ్మం మార్కెట్ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించాలన్నారు.