కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకాలోని వాణి విలాస సాగర విహంగ వీక్షణం.. మహాద్భుతమే. పైనుంచి చూస్తే భారతదేశ పటంలా దర్శనమిస్తుంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని జలవనరులశాఖ విడుదల చేసింది.
మైసూరు రాజు నాల్వడి కృష్ణరాజ ఒడెయరు తన తల్లి నంజమ్మణి వాణివిలాస పేరిట వేదావతినదికి అడ్డుగా ఈ ఆనకట్టను నిర్మించారు. నిర్మాణ పనులు 1898లో ప్రారంభించి 1907లో పూర్తిచేశారు.