కోనసీమ జిల్లా అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్ కు భారీ టేకు చేప వచ్చింది. కాకినాడకు చెందిన మత్స్యకారులు అంతర్వేది సముద్రతీరంలో చేపల వేటకు వెళ్లగా ఈ భారీ టేకు చేప వలకు చిక్కింది.
ధర కుదరక వ్యాన్ పై కాకినాడ కుంభాభిషేకం రేవుకు తీసుకెళ్లారు. చేపపై ఉండే శంకులను (పువ్వు) ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తారని, వాటితో అలంకార వస్తువులు తయారవుతాయని మత్స్యకారులు చెబుతున్నారు.