రాష్ట్రంలో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వికలాంగుల కోటాపై ట్విట్టర్ (X)వేదికగా కీలకవ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది.
దివ్యాంగులపై చేసిన వాఖ్యలపై చర్యలు తీసుకోవాలని సామాజికవేత్త వసుంధర పిటిషన్ దాఖలు చేశారు. యూపీఎస్సీ చైర్మన్కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో చెప్పాగా పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.