రాజస్థాన్ లోని అజ్మేర్లో సెక్స్ స్కామ్ కేసులో పోక్సో న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది.
1990 నాటి ఈ కేసులో గతంలో కొందరికి శిక్షలు పడగా.. తాజాగా మరో ఆరుగురు దోషులైన నఫీస్ చిస్తీ, నజీం అలియాస్ టార్జాన్, సలీం చిస్తీ, ఇక్బాల్ భాటి, సోహైల్ గని, సయ్యద్ జమీర్ హుస్సేన్లకు జీవిత ఖైదుతో పాటు రూ.5లక్షల చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.