ఫ్యూచర్ స్టేట్ తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి బృందం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది.
అమెరికా పర్యటన ముగించుకుని సౌత్ కొరియాకు వెళ్లారు. ప్రముఖ కంపెనీ LS గ్రూప్ చైర్మన్ కూ జాయన్ తో రేవంత్, శ్రీధర్ బాబు బృందం సమావేశమైంది. రాష్ట్రంలో పెట్టుబడులకు LS గ్రూప్ సుముఖత వ్యక్తం చేసిందని, ఆ కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్ కు రానున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.