అంతరిక్ష రంగంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న యూకేకు ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తర స్కాట్లాండ్లోని కొత్త స్పేస్పోర్ట్ లో ప్రయోగానికి ముందున్న ట్రయల్స్ లో భాగంగా పరీక్ష చేసే సమయంలో రాకెట్ ఇంజిన్ పేలిపోయింది.
ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని రాకెట్ ఆపరేటర్, జర్మన్ రాకెట్ తయారీదారు రాకెట్ ఫ్యాక్టరీ ఆగ్స్బర్గ్ అనే సంస్థ వెల్లడించింది.